Share News

నేటినుంచి అందుబాటులోకి మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:33 AM

ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌ నేటినుంచి అందుబాటులోకి రాబోతోంది. రాజేంద్రనగర్‌ శివారులోని శివరాంపల్లిలో నిర్మించిన స్టేషన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించనున్నారు.

నేటినుంచి అందుబాటులోకి మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌
Thummala Nageswara Rao

  • దాంతోపాటే విజయ వర్షి వాటర్‌ ప్లాంటు

  • నేడు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

  • వంటనూనెల విక్రయ కేంద్రానికి శంకుస్థాపన

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌ నేటినుంచి అందుబాటులోకి రాబోతోంది. రాజేంద్రనగర్‌ శివారులోని శివరాంపల్లిలో నిర్మించిన స్టేషన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు విజయ వర్షి మినరల్‌ వాటర్‌ ప్లాంటుకు కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేక్రమంలో విజయ వంటనూనెల విక్రయ కేంద్రం భవన నిర్మాణపనులకు శంకుస్థాపన చేస్తారు. తుమ్మలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


మెగా ఆయిల్‌ ప్యాకింగ్‌ స్టేషన్‌లో రోజుకు 200 టన్నుల నూనెను ప్యాకింగ్‌ చేస్తారు. పెరిగిన ఉత్పత్తి, ప్యాకింగ్‌ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని ఏడాదికి 60 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచినట్లు ఆయిల్‌ఫెడ్‌ అధికారులు వెల్లడించారు. రూ. 25కోట్లతో ఈ స్టేషన్‌ను నిర్మించటం గమనార్హం. కాగా ఈ ప్యాకింగ్‌ ప్లాంటు ద్వారానే... విజయ వర్షి మినరల్‌ వాటర్‌ ప్లాంటులోని తాగు నీటిని ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌వాటర్‌గా అందుబాటులోకి తేనున్నారు. దీంతోపాటు రూ.2కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన విజయ వంటనూనెల విక్రయ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.


ఇవి కూడా చదవండి...
కొత్త టీమ్‌తో అమిత్‌ షా భేటీ!

విద్యుత్‌ కొరతతో పంటలు ఎండుతున్నాయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 05:33 AM