విద్యుత్ కొరతతో పంటలు ఎండుతున్నాయి
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా తగ్గిందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
24 గంటల కరెంటు ఎక్కడిస్తున్నారు?: హరీశ్ రావు
నంగునూరు/హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో విద్యుత్ కొరతతో రైతుల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రాజస్థాన్‌కు 800 మెగావాట్ల సింగరేణి విద్యుత్‌ను అమ్ముకునేందుకు సర్కార్ జాయింట్ వెంచర్ చేసుకుంది. ఇక్కడ విద్యుత్ అవసరముండగా వేరే రాష్ట్రానికి అమ్ముకోవడమెందుకు?’’ అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు నిలదీశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ సరఫరా రికార్డులను, లాగ్‌బుక్‌ను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఏడెనిమిది గంటలైనా వ్యవసాయిని త్రీఫేస్ కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో లో వోల్జేజీ కారణంగా వ్యవసాయ విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలి, రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. అధికారంలోకి వచ్చాక వెయ్యిమంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ.. మూడేళ్లు గడిచినా అమలు కాలేదని, కళాకారులను కూడా దగాచేసిన దుర్మార్గపు ప్రభుత్వమిదని హరీశ్‌రావు విమర్శించారు. ‘డైవర్షన్ రాజకీయాలు.. ఊక దంపుడు డైలాగులతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతావ్.. రేవంత్‌రెడ్డీ.. కళాకారుల జీవితాలతో చెలగాటమాడొద్దు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని ఎక్స్‌వేదికగా ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నో మైనింగ్ జోన్‌గా ఫ్యూచర్ సిటీ!
వారంలోగా చెక్కులపై సంతకాలు చేయకుంటే చర్యలు
Read Latest Telangana News And Telugu News