Share News

కొత్త టీమ్‌తో అమిత్‌ షా భేటీ!

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:27 AM

రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, సహ ఇన్‌చార్జులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

కొత్త టీమ్‌తో అమిత్‌ షా భేటీ!
Amit Shah

  • రేపు రాష్ట్ర పర్యటనకు కేంద్ర హోంమంత్రి

  • అమూల్‌ మిల్క్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, సహ ఇన్‌చార్జులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌, సహ ఇన్‌చార్జులుగా అభయ్‌ పాటిల్‌, రేఖా శర్మ, సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ నియమితులైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్‌ షా వారికి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.


అమిత్‌ షా పర్యటన ఇలా..

అమిత్‌ షా శనివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి తూప్రాన్‌ చేరుకుంటారు. బ్రాహ్మణపల్లిలో అమూల్‌ మిల్క్‌ చిల్లింగ్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కరీంనగర్‌ చేరుకుని ప్రతిమ మెడికల్‌ కాలేజీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అమిత్‌ షా శంకుస్థాపన చేయబోతున్న అమూల్‌ మిల్క్‌ ప్లాంటు దక్షిణాదిలోనే పెద్దదని మెదక్‌ ఎంపీ ఎం.రఘునందన్‌రావు పేర్కొన్నారు. రూ.200 కోట్లతో చేపట్టనున్న ఈ ప్లాంటు ద్వారా ప్రతిరోజు 5 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తారని చెప్పారు. 200 మంది శాశ్వత ఉద్యోగులు, సిబ్బంది, మరో 2 వేల మంది కాంట్రాక్టు సిబ్బందికి ఉపాధి కలుగుతుందని వివరించారు.


ఇవి కూడా చదవండి...
నో మైనింగ్‌ జోన్‌గా ఫ్యూచర్‌ సిటీ!

విద్యుత్‌ కొరతతో పంటలు ఎండుతున్నాయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 05:27 AM