Share News

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:08 PM

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ చౌరస్తాలో రెనో, మహీంద్ర షోరూమ్స్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్, ఏప్రిల్ 27: అంబర్‌పేట్ చౌరస్తాలోని రెనో, మహీంద్ర షోరూమ్స్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే షోరూమ్ యజమానులు.. అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పుతున్నారు. ప్రమాదానికి గురైన షోరూమ్స్ వెనుక వైపు గృహసముదాయాలు ఉన్నాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండటం, ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో.. షోరూమ్స్‌కి ఆనుకుని ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు పోలీసులు.


అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం కారణంగా.. షోరూమ్‌లోని వాహనాలన్నీ దగ్ధమయ్యాయని.. భారీగా ఆస్తి నష్టం కలిగిందని షోరూమ్ యజమానులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 05:17 PM