Share News

‘సర్‌’లో బీజేపీ వ్యతిరేక ఓట్లే తొలగిస్తున్నారు

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:33 AM

సర్‌ ప్రక్రియలో బీజేపీ వ్యతిరేక ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు.

‘సర్‌’లో బీజేపీ వ్యతిరేక ఓట్లే తొలగిస్తున్నారు
Mallu Ravi

  • ఇప్పటికే 13 కోట్ల మందివి తొలగింపు: మల్లు రవి

  • క్రిశాంక్‌ ఆరోపణలు నిరాధారం: చరణ్‌కౌశిక్‌ యాదవ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో బీజేపీ వ్యతిరేక ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితి ప్రభుత్వం సృష్టించింది కాదని, ఇలాంటి సూపర్‌ ఎల్‌నినో 150 ఏళ్ల కిందట వచ్చిందన్నారు. ఎల్‌నినోను ప్రభుత్వం, ప్రజలు కలిసి ఎదుర్కొనాలని, రైతులు పంటలను ఆచితూచి వేసుకోవాలని సూచించారు.


బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ రోజుకో ప్రెస్‌మీట్‌తో ప్రచార ఆర్భాటం చేస్తున్నారని.. నిజంగా ఆయన దగ్గర ఆధారాలుంటే కోర్టులను లేదా దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని పశుగణాభివృద్ధి సంస్థచైర్మన్‌ డాక్టర్‌ చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ అన్నారు. మ్యాక్సిబియాన్‌, మైండ్‌వాల్స్‌, మెడికోవర్‌ అంశాల్లో సీఎం రేవంత్‌ కుటుంబ సభ్యులపై క్రిశాంక్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క

ఏసీబీకి కొత్త జవసత్వాలు

ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్‌!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:33 AM