Share News

మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:06 AM

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో ఆటలాడుతోందని, చదువుల కంటే సినిమా ఈవెంట్లకు ప్రాధాన్యం ఇస్తోందని ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్‌
Malla Reddy University

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులతో ఆటలాడుతోందని, చదువుల కంటే సినిమా ఈవెంట్లకు ప్రాధాన్యం ఇస్తోందని ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాన్ని సినిమా ఈవెంట్ల హబ్‌గా మార్చారని, వెంటనే సంస్థ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో తరగతులు నిర్వహించకుండా సినిమాలు చూడాలని విద్యార్థులకు సెలవులు ఇస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘తల్లిదండ్రులు ఫీజులు కట్టేది విద్యార్థులను సినిమా ఈవెంట్లకు పంపడానికా లేక సినిమాలు చూపించడానికా’ అని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:06 AM