Share News

కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారు: పీసీసీ చీఫ్

ABN , Publish Date - May 01 , 2026 | 11:59 AM

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత భయం వల్లే మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. హైడ్రా గురించి కేసీఆర్ చదువుకుంటే మంచిదని హితవుపలికారు.

కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారు: పీసీసీ చీఫ్
PCC Chief Mahesh Goud

హైదరాబాద్, మే 1: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవితకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ థాంక్స్ చెప్పారు. కవిత వల్లే మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మేల్కొంటున్నారని వ్యాఖ్యానించారు. కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారన్నారు. హైడ్రా గురించి కేసీఆర్ చదువుకుంటే మంచిదని హితవుపలికారు. కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. హైడ్రా వల్ల బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. సిటీ చుట్టూ ఉన్న చెరువులను ఆ పార్టీ నేతలే కబ్జా చేశారని ఆరోపించారు.


గులాబీ పార్టీ నేతలు ఎందుకు సభలు పెడుతున్నారని పీసీసీ చీఫ్ నిలదీశారు. తాము చేసిన డిక్లరేషన్లు అమలు చేస్తున్నామని.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం పదవుల భర్తీపై చర్చించినట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం, త్యాగాలు అమూల్యమైనవి: కేసీఆర్

లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2026 | 12:07 PM