మాదాపూర్లో గంజాయి విక్రయిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్..
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:26 PM
మాదాపూర్లో గంజాయి విక్రయిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ బలరాం మెహంతా (28)ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1,089 గ్రాముల గంజాయితోపాటు తూకం చూసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 20: మాదాపూర్లో గంజాయి విక్రయిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ బలరాం మెహంతా (28)ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1,089 గ్రాముల గంజాయితోపాటు తూకం చూసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఎన్డీపీఎస్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో ప్యాకెట్ రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు తమ విచారణలో నిందితుడు వెల్లడించాడని పోలీసులు చెప్పారు.
అదనపు ఆదాయం కోసం ఒడిశాకు చెందిన బాబు అనే వ్యక్తి వద్ద నుంచి కిలో గంజాయి రూ.15 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు చెప్పాడని పోలీసులు చెప్పారు. పక్కాగా అందిన సమాచారం నేపథ్యంలో మాదాపూర్ సిద్దిక్నగర్లోని రోడ్డు నంబర్4లో నివసిస్తున్న బలరాం నివాసంలో సోదాలు జరిపినట్లు పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా అతడి నివాసంలో ఈ గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక గంజాయి సరఫరా చేస్తున్న ఒడిశాకు చెందిన బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజల నాడి పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన రాహుల్ గాంధీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రొమ్ము క్యాన్సర్ గుర్తింపునకు ఏపీకి 750 ఐబ్రెస్ట్ పరికరాలు: మంత్రి సత్యకుమార్
For More AP News And Telugu News