Share News

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:28 PM

హైదరాబాద్‌‌‌‌లోని మాదాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్‌గా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

హైదరాబాద్‌, అక్టోబర్ 25: హైదరాబాద్‌‌‌‌లోని మాదాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్‌గా పోలీసులు గుర్తించారు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా పెళ్లికి తన ప్రియుడు నిరాకరించటంతో అర్చన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

మంచిర్యాల జిల్లాలో నీటి కుంటలో దిగి ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Oct 25 , 2026 | 06:28 PM