ట్రాక్టర్లలో 15 కిలోమీటర్లు..
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:55 AM
పోలవరం జిల్లా ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ పరిధిలోని వలస గ్రామాల్లోని ఓటర్లు ఓటు వేసేందుకు 15 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎన్నికల వేళ వలస గ్రామాల్లో ఓటర్లకు తిప్పలు
ఎటపాక, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ పరిధిలోని వలస గ్రామాల్లోని ఓటర్లు ఓటు వేసేందుకు 15 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గొల్లగుప్ప, సగ్గంపాడు, చీమిలివాగు, దొరగట్టు, దేవయ్యగుంపు, చెరువుగుంపు, సాలిబుడప, జగ్గారం, చుక్కలపాడు వలస గ్రామాల పరిధిలో 400 నుంచి 500 మంది వరకు ఓటర్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే విస్సాపురం లేదా చలంపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. గొల్లగుప్ప నుంచి విస్సాపురంలోని రెండు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు, దొరగట్టు, చుక్కలపాడు, జగ్గారం గ్రామాల ఓటర్లు విస్సాపురం లేదా చలంపాలెంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే 10 కిలోమీటర్లు వెళ్లాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం సమీపంలోని బండిరేవు గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కానీ స్థానిక ఎన్నికల సమయాల్లో ఆ పోలింగ్ కేంద్రాన్ని తీసేస్తారు. దీంతో ఎన్నికల వేళ కొందరు రాజకీయ పార్టీల నాయకులు ఈగ్రామాల ఓటర్లకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సమకూర్చి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: