నువ్వక్కడ.. నేనిక్కడ..
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:53 AM
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల స్థానిక ఎన్నికల్లో దంపతులు పోటీ చేస్తున్నారు. టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మాదిన రామారావు కొక్కిలిపుట్టుగ ఎంపీటీసీగా పోటీచేస్తుండగా, ఆయన భార్య మాదిన విమల పెద్దశ్రీరాంపురం ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
స్థానిక ఎన్నికల బరిలో దంపతులు
కంచిలి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల స్థానిక ఎన్నికల్లో దంపతులు పోటీ చేస్తున్నారు. టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మాదిన రామారావు కొక్కిలిపుట్టుగ ఎంపీటీసీగా పోటీచేస్తుండగా, ఆయన భార్య మాదిన విమల పెద్దశ్రీరాంపురం ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మండలాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఇద్దరం పోటీ చేస్తున్నామని వారు తెలిపారు. గతంలో కంచిలి ఎంపీపీ(కాంగ్రెస్) గా పనిచేసిన ఇప్పిలి కృష్ణారావు ప్రస్తుతం కంచిలి జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున పోటీచేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి గెలిచి కంచిలి జడ్పీటీసీగా పని చేసిన ఇప్పిలి లోలాక్షి (కృష్ణారావు భార్య) ప్రస్తుతం కేశరిపడ ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: