Share News

మాదాపూర్‌లో విషాదం.. పని ఒత్తిడితో భవనం నుంచి దూకిన సాఫ్ట్‌వేర్

ABN , Publish Date - Sep 15 , 2026 | 06:01 PM

పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌లో చోటుచేసుకుంది.

మాదాపూర్‌లో విషాదం.. పని ఒత్తిడితో భవనం నుంచి దూకిన సాఫ్ట్‌వేర్
software death in madapur

హైదరాబాద్, సెప్టెంబర్ 15: నగరంలోని మాదాపూర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పని ఒత్తిడిని భరించలేక ప్రాణాలు తీసుకున్నారు. హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్ అనే వ్యక్తి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివాసముంటున్నారు. అయితే.. పని ఒత్తిడి భరించలేక.. యశ్వంత్ బలవన్మరణానికి పాల్పడ్డారు. సొసైటీలోని హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.


ఈ ఘటనలో యశ్వంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హూటాహూటిన యశ్వంత్‌ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే యశ్వంత్ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి..

సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 08:13 PM