ఎర్రవల్లిలో కొనసాగిన సర్వే
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:15 AM
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండ లం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలోని సర్వే నెంబర్ 325లో చేపట్టిన రైతు వారీ సర్వే రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది.
సర్వే నెంబర్ 325లోని 244 మంది రైతులకు నోటీసులు
రెండో రోజు 70 మందికి చెందిన భూముల సర్వే
కొనసాగుతున్న హరీశ్‌రావు మామ భూముల హద్దుల గుర్తింపు
గజ్వేల్/మర్కుక్/కొండపాక సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండ లం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలోని సర్వే నెంబర్ 325లో చేపట్టిన రైతు వారీ సర్వే రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. సర్వే నం.325లోని 388.05 ఎకరాల భూమికి సంబంధించి రికార్డు ల్లో పేరున్న 244మంది రైతులకు మూడు దశల్లో ఇప్పటివరకు నోటీసులు జారీ చేశారు. ఇందులో మొదటి రోజు 55మందికి సంబంధించిన 100 ఎకరాల భూమిని సర్వే చేశారు. రెండో రోజు, మంగళవారం 70మందికి సంబంధించిన భూమి ని సర్వే చేశారు.
రెండు రోజుల్లో 125 మందికి సంబంధించిన భూమిని సర్వే చేయగా, ఇంకా 119 మంది రైతులకు చెందిన భూమిని సర్వే చెయ్యాల్సి ఉంది. రెండో రోజు నిర్వహించిన రైతు వారీ సర్వేను గజ్వేల్ ఆర్డీవో వీవీఎల్ చంద్రకళ పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును కల్పిస్తున్నారు. మరోపక్క, సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వెలికట్ట విశ్వనాథపల్లి శివారులోని సర్వే నెంబర్ 271లో బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు మామ హనుమంతరావుకు చెందిన భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియ రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. మొత్తం 327ఎకరాల 9 గుంటల పూర్తి విస్తీర్ణంలో హద్దులను నమోదు చేస్తున్నారు. విశ్వనాథపల్లి, రవీంద్రనగర్, జప్తి నాచారం శివారులోని సుజల స్రవంతి మిషన్ భగీరథ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
భక్తే శ్వాసగా ఈశ్వరమ్మ.. గుట్టపైనే తుదిశ్వాస!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News