Share News

నీటి సమస్య లేదనడం హాస్యాస్పదం

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:48 AM

హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

నీటి సమస్య లేదనడం హాస్యాస్పదం
KTR

  • మంత్రి ఉత్తమ్‌ను ఎద్దేవా చేసిన కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నగరంలో తాగునీటి సమస్యపై ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై సోమవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ఇటీవల తాను విన్న అత్యుత్తమ జోక్‌ ఇదేనని మంత్రిని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదన్నారు. కాంగ్రెస్‌ జోకర్లను ఎన్నుకుంటే.. సర్కస్‌ చూడాల్సిందేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్‌ పాలనలో ప్రజలను మోసగించడమే కాకుండా.. సీఎం, మంత్రులతోపాటు అధికారులు సైతం అబద్ధాలకు తెగబడ్డారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరోపించారు.


సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో టైంపాస్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఎవరి ఫోన్లు ట్యాప్‌ చెయ్యలేదని... బీఆర్‌ఎస్‌ నాయకుల ఫోన్లనే సీఎం ట్యాప్‌ చేస్తున్నారని విమర్శించారు. నీటికష్టాలు రాబోతున్నాయ్‌ జాగ్రత్తగా ఉండాలని సీఎం చెబుతుంటే.. మంత్రి ఉత్తమ్‌ నీటికొరత లేదంటున్నారు. ప్రజలు సీఎం చెప్పింది నమ్మాలా... ఉత్తమ్‌ చెప్పింది నమ్మాలా...? అని ఆయన ప్రశ్నించారు. మార్చిలో హైదరాబాద్‌లో దారుణమైన పరిస్థితి ఉండబోతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 05:48 AM