గాంధీలకు బాడీగార్డులా సీఎం రేవంత్
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:40 AM
ప్రజలు తమకిచ్చిన పదవుల గౌరవాన్ని దిగజార్చేలా కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
రాహుల్ వెంట మంత్రులు, పీసీసీ చీఫ్ పరుగులు అవమానకరం
షా చెప్పులు మోసిన బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు
పదవుల గౌరవాన్ని దిగజార్చుతున్న నేతలు: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమకిచ్చిన పదవుల గౌరవాన్ని దిగజార్చేలా కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జాతీయ పార్టీల నేతల వ్యవహారశైలి ఉందని విమర్శించారు. గాంధీలకు బాడీగార్డులా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, రాహుల్ గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పనివాళ్లలా పరుగులు తీయడం అవమానకరమని ఆదివారం ఎక్స్‌లో ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు... ఆ పార్టీ జాతీయ నేత అమిత్‌షా కాళ్లు మొక్కుతూ చెప్పులు మోశారని, కాంగ్రెస్, బీజేపీ నేతల్లో తమ పదవికి ఉండాల్సిన హుందాతనం, గౌరవం కరువయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు సిగ్గుచేటు, అవమానకరమని పేర్కొన్నారు. కాగా, పాలిటెక్నిక్ విద్యార్థుల ముందు సీఎం రేవంత్ నిరంకుశత్వం ఓడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. జీవో 157 జారీ ద్వారా.. గతంలో రేవంత్ తెచ్చిన జీఓ 97 తప్పని ఒప్పుకొన్నారని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News