Share News

అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై పోరాడుతాం: కేటీఆర్

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:52 AM

రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై అసెంబ్లీలో పోరాడుతామని తెలిపారు.

అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై పోరాడుతాం: కేటీఆర్
Former Minister KTR

హైదరాబాద్, మార్చి 16: గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి బీఆర్‌ఎస్ నేతలు నివాళులర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌కు చేరుకున్నారు. రాహుల్ బంధు కాదు.. రైతుబంధు కావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రకటించారని గుర్తుచేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు.


రైతులకు రైతుబంధు ఇవ్వకుండా రాహుల్‌కు వెయ్యి కోట్లు ఇస్తామని అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలు, రైతులు.. గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు ఆగకుండా ఇచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ తీర్చిదిద్ది అప్పగిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చట్టబద్ధతపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

హనుమాన్ మాలతో స్కూల్‌కు విద్యార్థులు.. అడ్డుకున్న యాజమాన్యం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 12:02 PM