Share News

240 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు.. ప్రజలే ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:36 AM

నెల్లూరులో రూ.613 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.

240 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు.. ప్రజలే ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే
MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, మార్చి 16: జిల్లాలో అభివృద్ధి పనులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(MLA Kotamreddy Sridhar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నిర్వహించిన సమావేశంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఉత్తమ ర్యాంక్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రూ.613 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిలో కొన్ని పూర్తయ్యాయని.. మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.


నగర పరిధిలో మొదటి ఏడాది రూ.42 కోట్లతో 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లోనే పూర్తి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. రెండో ఏడాది రూ.27 కోట్లతో 240 పనులు చేపట్టామని.. చెప్పిన ప్రకారం వాటిని కూడా 60 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. పడారుపల్లిలో ఈ పనుల ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.


స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేశారని ఆయన తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేశామని వివరించారు. ఈ నెల 22న 240 ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రజలే ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజా జాతరను తలపించేలా ప్రారంభోత్సవాలు జరుగుతాయని ఆయన చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 11:44 AM