ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Mar 16 , 2026 | 08:22 AM
పదో తరగతి పరీక్షలు ఈ రోజు అంటే.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, మార్చి 16: పదో తరగతి పరీక్షలు ఈ రోజు అంటే.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఏ మాత్రం ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి అంటూ విద్యార్థులకు ఆయన కీలక సూచన చేశారు.
ఈ పరీక్షల్లో 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం ఇదని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండంటూ వారికి ఆయన స్పష్టం చేశారు. విజయం మీదే. ఆల్ ది బెస్ట్ అంటూ వారికి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా 10వ తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు.
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. ప్రభుత్వం
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థుల హాల్ టికెట్ చూపించి, ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు ఉచితంగా చేరుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
ఒడిశాలోని కటక్ SCB హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి
For More TG News And Telugu News