తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
ABN , Publish Date - Mar 16 , 2026 | 07:42 AM
ఎండల తీవ్రత పెరిగింది. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్/అమరావతి, మార్చి16: ఎండల తీవ్రత పెరిగింది. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు అంటే.. మార్చి 16 నుంచి 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదలై మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు ఈ భారీ వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతో మార్చి 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది. అందువల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలతోపాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ!
ఒడిశాలోని కటక్ SCB హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి
For More TG News And Telugu News