కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రాష్ట్రంలో కరెంట్ పోయింది: కేటీఆర్
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:37 PM
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. తెలంగాణలో కరెంట్ పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కరెంట్ ఉండదని తాము ముందే చెప్పామని ఆయన గుర్తు చేశారు. తాము అప్పుడు చెప్పిందే ప్రస్తుతం జరుగుతోందని అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రాష్ట్రంలో కరెంట్ పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కరెంట్ ఉండదని తాము ముందే చెప్పామని ఆయన గుర్తు చేశారు. తాము అప్పుడు చెప్పిందే ప్రస్తుతం జరుగుతోందని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులో కనీసం 6 గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండట్లేదని పేర్కొన్నారు. ఇది ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభావమని వ్యంగ్యంగా అన్నారు.
థర్మల్ పవర్ స్టేషన్లకు బొగ్గు కూడా ఇవ్వలేక పోతున్నారంటూ రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో 1980లో ఫొటో ట్రెండ్ నడుస్తుంటే.. తెలంగాణలో మాత్రం 1980 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సమస్యపై అధిక దృష్టి పెట్టామని గుర్తు చేశారు. వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇచ్చామని వివరించారు. విద్యుత్ అంశంపైనే తమ మలి దశ ఉద్యమం నడిచిందని చెప్పారు. అద్భుతమైన విద్యుత్ వ్యవస్థను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రూపొందించారని ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్
సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Read Latest TG News And Telugu News