Share News

ధ్వంసమైంది అద్దాలే కాదు..హైదరాబాద్‌ ప్రతిష్ఠ!

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:39 AM

గచ్చిబౌలిలోని మెటా కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు.

ధ్వంసమైంది అద్దాలే కాదు..హైదరాబాద్‌ ప్రతిష్ఠ!
Meta office Hyderabad

  • మెటా కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని మెటా కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో కార్యాలయ అద్దాలు మాత్రమే ధ్వంసం కాలేదని, హైదరాబాద్‌ అంతర్జాతీయ ప్రతిష్ఠ, పెట్టుబడిదారుల్లో ఉన్న నమ్మకం కూడా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


శనివారం ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఒక్కరోజులో ఏర్పడలేదని, అనేక సంవత్సరాల పాటు అనుసరించిన, వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక అభివృద్ధి ఫలితంగా ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మెటా సంస్థ దేశంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందంటే నగరంలో సురక్షితమైన, అనుకూలమైన పని వాతావరణమే కారణమని గుర్తుచేశారు. సోషల్‌ మీడియా ఖాతాల నిలిపివేతకు నిరసనగా మెటా కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా, దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్‌ పార్టీ తీరుకు నిదర్శనమని కేటీఆర్‌ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 08:08 AM