రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలి: కూనంనేని
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:04 AM
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రమంతా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఇది కొన్ని మండలాలకే పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రమంతా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఇది కొన్ని మండలాలకే పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే కరువు దాడులు చేస్తామని హెచ్చరించారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.15 వేల భృతి చెల్లించాలని కోరారు. కరవు పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు నవంబరు 3, 4 తేదీల్లో సీపీఐ బృందం జిల్లాల పర్యటన చేస్తుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News