Share News

కొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాసింగ్

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:53 PM

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిందన్నారు.

కొండా సురేఖ ఎపిసోడ్.. నేటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో: రాజాసింగ్
Minister Konda Surekha

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిందన్నారు. ఈ వ్యవహారం ఢిల్లీకి చేరినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందని తెలిపారు. ఈరోజు(గురువారం) జరగనున్న ప్రెస్‌మీట్‌పై అందరి దృష్టి నెలకొందన్నారు. మంత్రి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ అధిష్ఠానం ఏదైనా చర్య తీసుకుంటుందా? లేక ఈ వివాదాన్ని అంతర్గతంగా పరిష్కరించుకుంటారా? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయని తెలిపారు. ఇవాళ్టి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.


కాగా.. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె అనుచిత వ్యాఖ్యలు, దీనిపై మంత్రి సమాధానం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. మంత్రి అంశం ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి చేరింది. ఈరోజు సురేఖ వ్యవహారంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి ఛాన్స్.. సురేఖ అంశాన్ని తేల్చేస్తారా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 12:57 PM