కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:27 AM
కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రజా, బీసీ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర పద్మశాలి సంఘం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
పంజాగుట్ట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రజా, బీసీ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాజకీయ విభాగం ఆధ్వర్యంలో చైర్మన్ గుంటి నగేష్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని వదులుకున్న త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని వక్తలు గుర్తు చేశారు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్న కుమార్తె పవిత్ర వాణికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
విద్య, వైద్యం, సామాజిక సేవ, బీసీ సంక్షేమం, చేనేత రంగాలపై ఆమెకున్న నిబద్ధతను గుర్తించి శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. సమావేశంలో దళిత నాయకుడు జేబీ రాజు, బీజేపీ నాయకుడు చక్రధర్, రాజకీయ విభాగం అధ్యక్షుడు వి.రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొండా పద్మ, అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకుడు గంధం రాములు, రఘునందన్, వివిధ సంఘాల నాయకులు లక్ష్మీనర్సయ్య, మేకల జయరాములు, పి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News