Share News

జర్మనీలో తెలంగాణ విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి చేయూత

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:53 AM

ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లి, డాక్యుమెంటేషన్‌ సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పరిమళ అనే పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మరోసారి అండగా నిలిచారు.

జర్మనీలో తెలంగాణ విద్యార్థినికి  మంత్రి కోమటిరెడ్డి చేయూత

  • రూ.6 లక్షల సాయం అందజేత

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లి, డాక్యుమెంటేషన్‌ సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పరిమళ అనే పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మరోసారి అండగా నిలిచారు. గతంలో కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా రూ.10 లక్షలు అందించి చదువు బాధ్యత తీసుకున్న ఆయన... తాజాగా ఆమె పరిస్థితి తెలుసుకుని తక్షణమే రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. జర్మనీ వెళ్లాక డాక్యుమెంటేషన్‌ సమస్యల వల్ల పరిమళ యూనివర్సిటీ ఎన్‌రోల్‌మెంట్‌ నిలిచిపోవడంతో పాటు ఆమె ఎక్స్‌పాట్రియో బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయింది.


విదేశీ గడ్డపై రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని పరిమళ జర్మనీ నుంచి వీడియో సందేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతును మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 05:53 AM