నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:27 AM
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణను ఎంపిక చేశారు.
పీడీఎఎఫ్ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ
ప్రజాసంఘాల తరఫున బరిలోకి
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణను ఎంపిక చేశారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మంగళవారం ప్రకటించారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజా సంఘాల తరఫున పీడీఎఫ్ అభ్యర్థిని ఆయన పరిచయం చేశారు. ఓటర్లు డబ్బు, మద్యానికి అతీతంగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీయూసీఐ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్.పద్మ, ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం కోసం సీఐటీయూ రూ.లక్ష విరాళాన్ని ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News