Share News

9 నుంచి కొడంగల్‌లో మెగా రైతుమేళా: తుమ్మల

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:11 AM

రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించటంతోపాటు...

9 నుంచి కొడంగల్‌లో మెగా రైతుమేళా: తుమ్మల
Thummala Nageswara Rao

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించటంతోపాటు... వ్యవసాయరంగంలో పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మెగా రైతుమేళా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఏడో తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. రైతుమేళాలో వ్యవసాయ, ఉద్యానశాఖలు, ఆయిల్‌ఫెడ్‌, ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశుసంవర్థకశాఖ, బ్యాంకింగ్‌ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి, క్రిడా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా 26 ప్రభుత్వశాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్‌ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 06:11 AM