హైకోర్టు తీర్పు ఎవరికీ చెంపపెట్టు కాదు: కోదండరాం
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:57 PM
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని టీజేఏసీ అధ్యక్షులు కోదండరాం అన్నారు. ఈ తీర్పు ఎవరికీ చెంపపెట్టు కాదన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీజేఏసీ అధ్యక్షులు కోదండరాం(Kodandaram) స్పందించారు. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, లోపాలు ఉన్నాయని కాగ్, విజిలెన్స్, ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌లు ఇచ్చాయని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. విచారణ చేయకపోతే సీబీఐదే తప్పవుతుందని టీజేఏసీ అధ్యక్షులు చెప్పుకొచ్చారు.
కాళేశ్వరంలో తప్పు జరిగిందని తెలుస్తున్నప్పుడు చర్యలు తీసుకోడానికి ఇబ్బంది ఏంటని కోదండరాం ప్రశ్నించారు. ‘బ్యారేజ్ నిర్మాణంలో పిల్లర్లు కుంగిపోయినవి మనకు కనిపిస్తుంది కదా... ఇంకేం కావాలి’ అని అన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఎవరకీ చెంపపెట్టు కాదని కోదండరాం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
మరో సకల జనుల సమ్మెగా మారుస్తాం: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
Read Latest Telangana News And Telugu News