గిరిజనుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:45 AM
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గిరిజన మహిళల సంక్షేమానికి ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
జనజాతీయ గౌరవ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: రాంచందర్‌రావు
కవాడిగూడ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గిరిజన మహిళల సంక్షేమానికి ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా 151వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జనజాతీయ గౌరవ దివస్ (గిరిజన గౌరవ దినోత్సవం) ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులు బిర్సాముండాను బంధించిన రాంచీలోని పాత సెంట్రల్ జైలును ఆయన త్యాగాలకు గుర్తుగా స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దామని తెలిపారు. గత 75 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి జరగకుండా నక్సలైట్లు అడ్డుకున్నారని, మోదీ ప్రభుత్వం నక్సలైట్లను నిర్మూలించి ఆ ప్రాంతాల్లో అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని తెలిపారు. ఎన్ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జల్ జమీన్ జంగిల్ హక్కుల కోసం బిర్సాముండా వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంగానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంగానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎస్టీ మోర్చా నేతలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News