‘ఖేలో ఇండియా’కు 120 కోట్లతో ఏర్పాట్లు: సీఎస్
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:14 AM
రాష్ట్రంలో డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026’కు రూ.120 కోట్లతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
రాష్ట్రంలో డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026’కు రూ.120 కోట్లతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్‌రావు సంజయ్ జాజు, రాష్ట్ర క్రీడా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ క్రీడల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏడు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నందున... వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ వివరించారు. హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News