కేసీఆర్ తెలంగాణకు కర్కోటకుడు, హిట్లర్: ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Apr 28 , 2026 | 03:20 PM
అనర్హత వేటు పడకుండా ఉండేందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కవిత పార్టీకి తెలంగాణలో స్పేస్ లేదని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకు కర్కోటకుడు, హిట్లర్ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ బయటకే రావడం లేదని.. ఆయన సభకు రాకున్నా అసెంబ్లీ నడుస్తోందని తెలిపారు. అనర్హత వేటు పడకుండా ఉండేందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని అన్నారు. కవిత పార్టీకి తెలంగాణలో స్పేస్ లేదన్నారు. అన్న మీద, తండ్రి మీద కోపంతోనే కవిత పార్టీ పెట్టారని విమర్శించారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు.
కవిత చెప్పే నిజాలను కేసీఆర్ ఒప్పుకున్నారని.. ఆమె చెప్పేవి నిజాలు కాబట్టే బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారని తెలిపారు. పదేండ్ల పాపపు పాలనలో తాను భాగమని కవిత ఒప్పుకున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ మొహం పెట్టుకుని వరంగల్లో సభ పెడతారని ప్రశ్నించారు. వరంగల్ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ చేయలేకపోయామని రైతులకు కేసీఆర్ చెప్పాలన్నారు. రుణమాఫీ చేస్తున్నామని తెలిసే బీఆర్ఎస్ సభలు పెడుతోందంటూ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...
మా ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు.. ఎవరినీ వదలం: హరీశ్ రావు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: స్టీఫెన్ రవీంద్ర
Read Latest Telangana News And Telugu News