పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో కేసీఆర్‌కు తెలియడం లేదు: ఎంపీ మల్లు రవి
ABN , Publish Date - Apr 28 , 2026 | 03:40 PM
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మరోసారి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫాం హౌస్‌లో ఉండే కేసీఆర్‌కు పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో తెలియనట్లు ఉందన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మరోసారి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫాం హౌస్‌లో ఉండే కేసీఆర్‌కు పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో తెలియనట్లు ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ కేసీఆర్‌కు ఆయన హితవు పలికారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని తాము వెంటనే పార్లమెంట్‌లో డిమాండ్ చేశామని ఈ సందర్భంగా మల్లు రవి గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: స్టీఫెన్ రవీంద్ర
For More TG News And Telugu News