ఆగస్టు18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. ఎప్పటి వరకూ అంటే..
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:44 PM
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ప్రకటించారు.
హైదరాబాద్, ఆగస్టు 11: నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ప్రకటించారు. ఆగస్టు 18 నుంచి ఈ వన్ వే అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రోడ్డుకు వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలులో ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
మరోవైపు.. ఇటీవల ఒకటి, రెండు ఆదివారాలు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని కూడళ్లలో సమస్యలను పరిష్కరించారు. అనంతరం అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ వన్ వేను అమలు చేయాలని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ పట్ల భవిష్యత్‌లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న
రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురి అరెస్ట్: నార్సింగి ఎస్ఐ
For More AP News And Telugu News