రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురి అరెస్ట్: నార్సింగి ఎస్ఐ
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:52 AM
హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు11: హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. హైదర్ షా కోటలోని తన అత్తగారింటికి బోనాల పండుగ సందర్భంగా అతడు వచ్చారని చెప్పారు. తన బావమరిది వికాస్ గౌడ్‌తో కలిసి పార్టీ చేసుకున్నారని అన్నారు. అనంతరం తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని లంగర్ హౌస్ వైపు వారంతా కారులో అతి వేగంగా బయలుదేరారని పేర్కొన్నారు.
ఆ క్రమంలోనే రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవీందర్‌తోపాటు బైక్‌ను కారుతో ఢీకొట్టారని తెలిపారు. అయితే రవీందర్ అక్కడికక్కడే మరణించగా.. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. ఈ కేసులో పట్టుబడిన నలుగురికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశామన్నారు. వీరంతా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. అలాగే వీరికి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వీరిపై 204 పార్ట్ 4 ఐపీసీతోపాటు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీయొద్దని ప్రజలకు నార్సింగ్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సోమవారం తెల్లవారుజామున హైదర్ షాకోట్ ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర ఎస్‌యూవీ 350 కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ గాలిలోకి ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు. అనంతరం బైక్ మీదకు కారు వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత కారులో వారంతా పరారీ అవుదామనుకున్నారు. కానీ కారు ముందుకు కదల్లేదు. దీంతో కారు వదిలి వారంతా అక్కడి నుంచి పరారైయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రవీంద్ర మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. కారు రాంగ్ రూట్‌లో రావడంతోపాటు వారంతా మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాల్వలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి గల్లంతు
యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం
For More TG News And Telugu News