Share News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాల్లో కోతలెందుకు?

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:20 AM

కేంద్రం నిధులిస్తున్నా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ఏమిటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాల్లో కోతలెందుకు?
Kalvakuntla Kavitha

  • ఉద్యోగులపై వివక్ష చూపడం సర్కార్‌కు తగదు: కవిత

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నిధులిస్తున్నా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ఏమిటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఉండగా, వారి జీతాలను రూ.4-5వేల వరకు తగ్గించడం దుర్మార్గమని అన్నారు. ఒక వైపు ద్రవ్యోల్బణంతో ధరలు పెరుగుతూ ఉంటే ఉద్యోగుల జీతాలు ఎలా తగ్గిసారని నిలదీశారు. ఉద్యోగుల పట్ల వివక్ష తగదని అభిప్రాయపడ్డారు.


ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఒక్క రోజు పని మానేస్తే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దెబ్బ తింటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాలను పెంచి.. రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌ్‌సను కవిత సోమవారం సందర్శించనున్నట్లు టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

కీసర మాజీ సీఐ కోటీశ్వరుడే!

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 19 , 2026 | 06:20 AM