రేవంత్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజం మొత్తం చూసింది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ABN , Publish Date - Sep 08 , 2026 | 09:38 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ ఎమ్మెల్యే పదవికి మీరు రాజీనామా చేస్తే.. హుజూరాబాద్‌లో తాను రాజీనామా చేస్తానని పేర్కొ్న్నారు. అనంతరం జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 08: కొడంగల్‌లో మీరు రాజీనామా చేస్తే.. హుజూరాబాద్‌లో తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. అనంతరం జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష.. ఉపయోగించిన పదజాలం తెలంగాణ సమాజం మొత్తం చూసిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు.
శాసనసభ్యులను అవమానించారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళా జర్నలిస్టులపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని పేర్కొ్న్నారు. కత్తులతో నరుకుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఎథిక్స్ కమిటీతో తనపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నారంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కోట్లాది రూపాయలు ఎత్తుకు పోయి, తమ పార్టీ బీ ఫారంపై గెలిచినా వ్యక్తి కడియం శ్రీహరి అని గుర్తు చేశారు. అలాంటి ఆయన తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎంపీ అయినప్పుడు ఆయనకు ఎథిక్స్ గుర్తు రాలేదా? అంటూ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేము సిద్ధం, మీరు సిద్ధమా?: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్లు
For More TG News And Telugu News