కాళేశ్వరం పునరుద్ధరణకు డిజైన్లు అందజేత
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:32 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లు సిద్ధమయ్యాయి.
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లు సిద్ధమయ్యాయి. డిజైన్ కన్సల్టెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సిద్ధం చేసి తాజాగా రాష్ట్ర నీటిపారుదల శాఖకు అందజేసింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఈనెల 14న ఉదయం 10.30 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీ్స్ఏ) సమావేశ మందిరంలో భేటీ అయి ఈ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను పరిశీలించనుంది.
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లోని బ్యారేజీ, కాలువల రూపకల్పన విభాగం డైరెక్టరేట్ సోమవారం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. డిజైన్ కన్సల్టెన్సీ అందించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను ఆమోదించే అంశంపై కమిటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించిన వివిధ రకాల పరీక్షలు, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ విశ్లేషణలతో పాటు 3డీ మోడల్ స్టడీస్‌పై నివేదికను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణులు కమిటీ ముందుంచనున్నారు. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఆమోదిస్తే వెంటనే తుది డిజైన్లను సిద్ధం చేసి.. పునరుద్ధరణ పనులకు అంచనాలను తయారు చేసి మంత్రివర్గ ఆమోదంతో పనులు ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కూనంనేని
141 మందికి అపోలో వైద్య పట్టాల ప్రదానం
ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం
Read Latest AP News And Telangana News And International News And Telugu News