మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కుట్రను సాగనివ్వం: నారాయణ
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:19 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో కేంద్రం డీలిమిటేషన్ను అమలు చేసే రాజకీయ కుట్రను సాగనివ్వబోమని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు.
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో కేంద్రం డీలిమిటేషన్ను అమలు చేసే రాజకీయ కుట్రను సాగనివ్వబోమని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అన్నారు. చిత్తశుద్థి ఉంటే డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుగానే ఆమోదించి అమలు చేయాలన్నారు.
ఈ విషయం చంద్రబాబునాయుడు, డీఎంకే నాయకత్వానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను అనైతికంగా చీల్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరణంపై నారాయణ సంతాపం తెలిపారు. ఆయన తనకు ఆత్మీయుడని, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!
ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...
Read Latest AP News And Telangana News And International News And Telugu News