Share News

తెలంగాణ సంస్కృతికి ప్రవాసులే రాయబారులు

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:26 AM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ప్రవాస తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రవాసులే రాయబారులు
Jupally Krishna Rao

  • స్విట్జర్లాండ్‌లో బతుకమ్మ సంబరాల్లో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ప్రవాస తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో స్విట్జర్లాండ్‌ తెలుగు అసోసియేషన్‌, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి.. విదేశీ గడ్డపై తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతున్నారంటూ తెలుగు కుటుంబాలను అభినందించారు.


తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటకం, ఫిల్మ్‌ టూరిజం, ఆతిథ్య రంగాల్లో తెలంగాణ-స్విట్జర్లాండ్‌ మధ్య పరస్పర సహకారానికి విస్తృత అవకాశా లున్నాయని, తెలంగాణలో పెట్టుబడులకు స్విస్‌ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని జూపల్లి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

సింగరేణిని కాపాడుకోవాలి

జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:26 AM