సీజీహెచ్‌ఎస్ కార్డుతో జేఈఈ రిజిస్ట్రేషన్‌కు అనుమతివ్వాలన్న హైకోర్టు
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:01 AM
ఆధార్ కార్డు లేని ఓ విద్యార్థికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (సీజీహెచ్‌ఎస్) కార్డుతో జేఈఈ - 2027 సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతివ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ), కేంద్ర విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఆధార్ కార్డు లేని ఓ విద్యార్థికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (సీజీహెచ్‌ఎస్) కార్డుతో జేఈఈ - 2027 సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతివ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ), కేంద్ర విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జేఈఈ మెయిన్స్-2027కు దరఖాస్తు చేసుకోవడానికి పరోక్షంగా ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ మాస్టర్ నితీశ్ చంద్ర గ్రంథి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం.. మైనర్ అయిన పిటిషనర్‌కు పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డు లేనందున సీజీహెచ్‌సీ కార్డు ద్వారా జేఈఈ మెయిన్స్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతివ్వాలని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News