Share News

ఎక్సైజ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికిషన్‌..!

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:15 AM

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా సైబరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) జె.హరికిషన్‌ ఎన్నికయ్యారు.

ఎక్సైజ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికిషన్‌..!
Excise

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా సైబరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) జె.హరికిషన్‌ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా హనుమంతరావు (ఈఎస్‌, మల్కాజిగిరి), కోశాధికారిగా డి.శ్రీనివాస్‌ (ఏసీ, గ్రేటర్‌ హైదరాబాద్‌) ఎన్నికయ్యారు.


అసోసియేటెడ్‌ ప్రెసిడెంట్లుగా ఏ.చంద్రయ్య, శశిధర్‌ రెడ్డి, జ్యోతి కిరణ్మయి, ఆర్‌.ప్రవీణ్‌, కె.రాజ్యలక్ష్మి.. ఉపాధ్యక్షులుగా జి.శ్రీనివాసరెడ్డి, జి.గణేశ్‌, కే.తిరుపతి, ఎం.శ్రీనివాసరావు, ప్రవీణ్‌ చంద్ర.. సంయుక్త కార్యదర్శులుగా నవీన్‌కుమార్‌, సుధాకర్‌, కరంచంద్‌, మోహన్‌కుమార్‌, శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మహిళా కార్యదర్శులుగా కృష్ణప్రియ, నివేదిత, పబ్లిసిటీ కార్యదర్శిగా సాయిరాం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ప్రదీ్‌పరావు, స్పోర్ట్స్‌ కార్యదర్శులుగా జీవన్‌ కిరణ్‌, చిరంజీవిలతోపాటు మరో 12 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:15 AM