లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగానే ఆస్తులు!
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:13 AM
విధి నిర్వహణలో అక్రమంగా లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగానే కొందరి నుంచి డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తులను తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం గుర్తించింది.
డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తులను సీజ్ చేసిన ఐటీ శాఖ
రెండు ఇళ్లు, 3 ఎకరాల పొలం, ఇన్నోవా కారు జప్తు
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అక్రమంగా లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగానే కొందరి నుంచి డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తులను తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం గుర్తించింది. ఈ మేరకు రెండు ఇళ్లు, 3.2 ఎకరాల వ్యవసాయ భూమి, ఇన్నోవా కారు ను జప్తు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ రూ.59.40 లక్షలు ఉండగా, మార్కెట్‌లో చాలా ఎక్కువ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
2023లో భీమ్‌రెడ్డి పటాన్‌చెరులో పని చేస్తున్న సమయంలో జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించినందుకు ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్ పేరిట డెవలప్ చేసిన వెంచర్‌లోని రెండు ఇళ్లను భీమ్‌రెడ్డి బినామీ ఇంద్రకరణ్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసిందని ఐటీ అధికారులు గుర్తించారు. ప్రమాదాలకు సంబంధించిన వివాదంలో సాయం చేసినందుకు యాపిల్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని ఆలూరి సురేష్ తన ఇన్నోవా క్రిస్టా కారును భీమ్‌రెడ్డికి బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. జహీరాబాద్ సమీపంలోని మొగుడంపల్లిలో 4 చోట్ల ఉన్న 3.20 ఎకరాల భూమిని హోంగార్డు లక్ష్మణ్ నాయక్ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News