Share News

నేటి నుంచి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:21 AM

ఆహారం, పశుగ్రాసం, పశువుల మేత, ఇంధనం, సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా మొక్క జొన్న ప్రాధాన్యతను చాటిచెప్పే లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సును ఈ నెల 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

నేటి నుంచి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు
International Maize Conference 2026

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆహారం, పశుగ్రాసం, పశువుల మేత, ఇంధనం, సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా మొక్క జొన్న ప్రాధాన్యతను చాటిచెప్పే లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సును ఈ నెల 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ‘మారుతున్న ప్రపంచంలో ఆహారం, పశువుల దాణా, పశుగ్రాసం, ఇంధనం సుస్థిరత కోసం మొక్కజొన్న విప్లవం’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఏయూ), మేజ్‌ టెక్నాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎంటీఏఐ), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌), అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం(సీఐఎంఎంవైటీ)లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:21 AM