పరిశోధనలు ప్రజలకు నేరుగా ఉపయోగపడాలి
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:55 AM
సముద్రం, వాతావరణానికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలను తీరప్రాంత ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఉందని భారత శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
సముద్ర, వాతావరణ శాస్త్ర సమాచారం సులభంగా అర్థమవ్వాలి
కాప్ 31 ‘ఓషన్ డైలాగ్’లో భారత శాస్త్రవేత్తల అభిప్రాయం
హైదరాబాద్ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సముద్రం, వాతావరణానికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలను తీరప్రాంత ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఉందని భారత శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న కాప్ 31 సదస్సులో నిర్వహించిన ఓషన్ డైలాగ్‌లో ఈ అంశంపై చర్చించారు. భారత భూ విజ్ఞాన శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం) ప్రతినిధులు తమ సంస్థల శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాలను వివరించారు.
భారత్ తరఫున ఇన్కాయిస్ డైరెక్టర్ టి.ఎం.బాలకృష్ణన్ నాయర్, ఐఐటీఎం శాస్త్రవేత్త స్వప్న పనికల్ చర్చల్లో పాల్గొన్నారు. సముద్ర పరిస్థితుల అంచనాలు, సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, మత్స్యకారులకు అనువైన చేపల వేట ప్రాంతాల సమాచారం, తీరప్రాంత ప్రమాదాలపై హెచ్చరికలు అందించడంలో ఇన్కాయిస్ కీలక పాత్ర పోషిస్తోందని బాలకృష్ణన్ వివరించారు. మరోవైపు, వాతావరణంలో మార్పులు, దీర్ఘకాలిక వాతావరణ ధోరణులను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు ఐఐటీఎం స్వదేశీ ఎర్త్ సిస్టమ్ మోడలింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ సదస్సులో భాగంగా సముద్ర శాస్త్ర రంగంలో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఇన్కాయిస్, మెర్కేటర్ ఓషన్ ఇంటర్నేషనల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్, మెర్కేటర్ ఓషన్ డైరెక్టర్ జనరల్ పియర్ బహురెల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News