అక్రమ అండాల సేకరణ కేసులో డాక్టర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:27 AM
అక్రమ అండాల సేకరణ కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ పీ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
హైకోర్టులో పోలీసుల వాదన
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అక్రమ అండాల సేకరణ కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ పీ పద్మజకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పద్మజా ఫెర్టిలిటీ సెంటర్ యజమానురాలయిన అయిన డాక్టర్ పద్మజ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ మేరకు కౌంటర్ దాఖ లు చేశారు.
ఈ కేసులో ఏ-1గా ఉన్న శెట్టి వర్కింగ్ విమెన్స్ హాస్టల్ నిర్వాహకుడు అమిరిశెట్టి దుర్గాప్రసాద్ తన నేరాంగీకార వాంగ్మూలంలో చాలా స్పష్టంగా ఆమె పాత్ర గురించి వివరించినట్లు తెలిపారు. దాని ఆధారంగానే ఆమె ను ఏ-6గా చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, దర్యాప్తు కొనసాగుతున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News