Share News

అణు విద్యుత్‌ రంగానికి నిపుణుల తయారీ

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:02 AM

భారత అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఐఐటీ హైదరాబాద్‌, క్రిమ్సన్‌ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘అనుజ్ఞాన్‌ - న్యూక్లియర్‌ టెక్నాలజీ ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌’ తొలి బ్యాచ్‌ శిక్షణ ముగిసింది.

అణు విద్యుత్‌ రంగానికి నిపుణుల తయారీ
Anugyan Programme

  • ఐఐటీ హైదరాబాద్‌లో ‘అనుజ్ఞాన్‌’ తొలి బ్యాచ్‌ శిక్షణ పూర్తి

  • 23 మందికి ధ్రువీకరణ పత్రాలు

కంది, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఐఐటీ హైదరాబాద్‌, క్రిమ్సన్‌ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘అనుజ్ఞాన్‌ - న్యూక్లియర్‌ టెక్నాలజీ ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌’ తొలి బ్యాచ్‌ శిక్షణ ముగిసింది. 12 వారాల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 23 మంది ఇంజినీర్లు, పరిశ్రమ నిపుణులకు సోమవారం కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంప్‌సలో ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్మన్‌ ఘనశ్యామ్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తే నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయొచ్చన్నారు. అణుశక్తి రంగంలో ఉన్నత విద్య, పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి మరిన్ని అవకాశాలను పరిశీస్తామని వెల్లడించారు. సాధారణ ఇంజనీరింగ్‌ విద్యకు, అణు పరిశ్రమల్లో క్షేత్రస్థాయిలో అవసరమయ్యే నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 8.8 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండగా, 2047 నాటికి 100 గిగావాట్ల స్థాయికి పెంచాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు, పరికరాల తయారీ, నిర్వహణ కార్యకలాపాలు, నాణ్యత ప్రమాణాలు, భద్రత వంటి విభాగాల్లో శిక్షణ పొందిన నిపుణుల అవసరం గణనీయంగా పెరగనుందని అంచనా.ఈ నైపుణ్యాలను అందించేందుకు అనుజ్ఞాన్‌ కార్యక్రమాన్ని రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:02 AM