Share News

నా బ్యాంక్ ఖాతాలు అన్‌ఫ్రీజ్ చేయండి.. కోర్టులో ఐబొమ్మ రవి పిటిషన్

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:48 PM

ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమ్మంది రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఫ్రీజ్ చేసిన తన డబ్బులను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నా బ్యాంక్ ఖాతాలు అన్‌ఫ్రీజ్ చేయండి.. కోర్టులో ఐబొమ్మ రవి పిటిషన్
iBomma Ravi

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఐబొమ్మ మాజీ నిర్వహకుడు ఇమ్మంది రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఫ్రీజ్ చేసిన తన డబ్బులను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా రవికి సంబంధించిన బ్యాంకు అకౌంట్‌లు, ప్రాపర్టీ డిపాజిట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో బ్యాంక్‌ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు రవి కోర్టుకు తెలియజేశారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని.. తన అకౌంట్‌ల ద్వారా ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లను అన్‌ఫ్రీజ్‌ చేయాలని పిటిషన్‌లో రవి కోరారు. దీనిపై ఈరోజు నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది.


కాగా.. ఉన్నత చదువుల కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవి.. ఆపై ఐబొమ్మ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలు ప్రసారం చేస్తూ కోట్లు సంపాదించరనే ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలంగా విదేశాల్లో ఉంటూ లగ్జరీ జీవితాన్ని గడిపారు. అంతేకాకుండా దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరారు. ఈ విషయాన్ని సీరయస్‌గా తీసుకున్న పోలీసులు.. వ్యక్తిగత కారణలతో విదేశాల నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఐబొమ్మ రవి వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరిపారు. దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్న రవి.. బెయిల్‌‌పై విడుదలయ్యారు.


ఇవి కూడా చదవండి...

హోటల్‌లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్

వాళ్లను చరిత్ర క్షమించదు.. ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 03:11 PM