Share News

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:55 PM

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం
Telangana Transport Minister Ponnam Prabhakar

హైదరాబాద్, జూన్ 08: ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఓవర్‌ లోడింగ్, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అలాగే పన్నులు చెల్లించని వాహనాలకు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే వాహనాల సీజ్‌కు ఆదేశాలు ఇస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయిలో రెండు స్పెషల్ స్క్వాడ్‌ల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని తెలిపారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను రవాణా చేస్తే.. అలాంటి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల పన్నులు ఎగ్గొట్టే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలకు ఇకపై చెక్ పెడతామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మహిళా శక్తికి 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ

తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌తో ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట: మంత్రి తుమ్మల

For More TG News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 07:16 PM