పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మహిళా శక్తికి 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:10 PM
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు కేటాయించనుంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ బస్సులను మహిళా సంఘాలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
హైదరాబాద్, జూన్ 08: మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు కేటాయించనుంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ బస్సులను మహిళా సంఘాలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిట్టింగ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్, భద్రత తదితర అంశాలపై ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కీలక ఆదేశాలు జారీ చేశారు.
దేశంలోనే మహిళా బస్సుల పథకం అతిపెద్ద స్థాయిలో అమలవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాల్లో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో భాగంగా వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులతో మహిళలకు చేయూతను అందిస్తోంది. రాష్ట్ర మహిళా సాధికారత నమూనాను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా మహిళలు హాజరు కానున్నారు. అందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల గడిచినా లభించని కల్పన ఆచూకీ..!
తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌తో ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట: మంత్రి తుమ్మల
For More TG News And Telugu News