Share News

20 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 10:37 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వైశాలీనగర్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద రోడ్డు విస్తరణ, వాటర్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో 20 రోజుల పాటు అండర్‌పాస్‏ను పూర్తిగా మూసివేస్తున్నారు.

20 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు
Hyderabad Traffic Alert

  • వైశాలీనగర్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద నేటి నుంచి వాహనాల మళ్లింపు

  • రోడ్డు విస్తరణ, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారుల నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వైశాలీనగర్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద రోడ్డు విస్తరణ, వాటర్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 16 నుంచి 20 రోజుల పాటు అండర్‌పాస్‏ను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌) సన్‌ప్రీత్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వైశాలీనగర్‌ రైల్వే అండర్‌పాస్‌ ప్రస్తుతం ఇరుకుగా ఉండటంతో పాటు, భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అండర్‌పా్‌సను విస్తరించడం, సమర్థవంతమైన స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం సంబంధిత విభాగాల అధికారులు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ట్రాఫిక్‌ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.


ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

  • మై హోమ్‌ మంగళా నుంచి వైశాలీనగర్‌ అండర్‌పాస్‌ మీదుగా హఫీజ్‌పేట్‌ వెళ్లే వాహనాలు... మై హోమ్‌ మంగళా టీ-జంక్షన్‌ వద్ద యూ-టర్న్‌ తీసుకుని రాఘవేంద్ర నగర్‌ కాలనీ జంక్షన్‌-హైటెన్షన్‌ రోడ్‌-ఆర్టీఏ కార్యాలయం-కొండాపూర్‌-హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ మార్గంలో ప్రయాణించాలి.

  • తెలంగాణ కాంట్రాక్టర్స్‌ కల్చరల్‌ క్లబ్‌ వైపు నుంచి వైశాలీనగర్‌ అండర్‌పా్‌సకు వచ్చే వాహనాలు... మై హోమ్‌ మంగళా టీ-జంక్షన్‌- రాఘవేంద్ర నగర్‌ కాలనీ-హైటెన్షన్‌ రోడ్‌ - ఆర్టీఏ కార్యాలయం- కొండాపూర్‌- హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ/ఫ్లైఓవర్‌ మీదుగా హఫీజ్‌పేట్‌, ఆల్విన్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలి.


  • హఫీజ్‌పేట్‌, ఆర్టీసీ కాలనీ, మై హోమ్‌ జువెల్‌ ప్రాంతాల నుంచి మై హోమ్‌ మంగళా వైపు వెళ్లే వాహనాలు... పైప్‌లైన్‌ రోడ్‌- హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ/ఫ్లైఓవర్‌ -జెన్‌పాక్ట్‌ వద్ద ఎడమ మలుపు- కొండాపూర్‌-ఆల్విన్‌ రోడ్‌ -ప్రభుత్వ పాఠశాల యూటర్న్‌- హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ ద్వారా ప్రయాణించాలి.


zz.jpg

  • వాసవి లేక్‌ సిటీ, హఫీజ్‌పేట్‌ లేక్‌ ప్రాంతాల నుంచి మై హోమ్‌ మంగళా, రాఘవేంద్ర నగర్‌ వైపు వెళ్లే వాహనాలు... స్పెపర్‌ వన్‌ అపార్ట్‌మెంట్స్‌ యూ-టర్న్‌ హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ- జెన్‌పాక్ట్‌ వద్ద ఎడమ మలుపు- కొండాపూర్‌-ఆల్విన్‌ రోడ్‌- ప్రభుత్వ పాఠశాల యూటర్న్‌ హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ ద్వారా ప్రయాణించాలి.


  • గోపాల్‌నగర్‌, కల్వరీ టెంపుల్‌ ప్రాంతాల నుంచి మై హోమ్‌ మంగళా వెళ్లే వాహనాలు... హఫీజ్‌పేట్‌ అండర్‌పా్‌స/ఆర్‌ఓబీ వద్ద కుడివైపు తిరిగి కొండాపూర్‌-ఆల్విన్‌ రోడ్‌- ప్రభుత్వ పాఠశాల యూటర్న్‌ హఫీజ్‌పేట్‌ ఆర్‌ఓబీ మీదుగా కొండాపూర్‌, రాఘవేంద్ర నగర్‌ వైపు వెళ్లాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 10:37 AM